సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వీఐపీలను బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కన్నాభాయ్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సీఎంని చంపేస్తామంటూ ట్వీట్స్ చేసిన పవన్ ఫణి అరెస్ట్ అయ్యాడు.సైబర్ క్రైం ఎస్పీ రాధిక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మానవబాంబుగా మారి సీఎంను చంపేస్తానంటూ పోస్టింగులు చేశాడు. పవన్ ఫణి జనసేన మద్దతుదారుడని, ట్విట్టర్లో పోస్టులు పెట్టి…
నక్కపల్లి మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంయత్నం కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత? అని ఆమె మండిపడ్డారు. ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్మోహన్ రెడ్డి కి తెలియదా అని…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి లేఖ రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రైల్వే స్థలాలకు సంబంధించిన అంశంపై జగన్‌కు లోకేష్ లేఖ రాశారు. తాడేపల్లిలో రైల్వేస్థలాల్లో నివసిస్తున్న పేదవారికి గతంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు… వేరేచోట ఇళ్లు కట్టేవరకు రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా సమయం ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. Read Also: భారీగా పెరిగిన సెంట్రల్ విస్టా…
ఏపీలో పీఆర్సీ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోలు ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేవంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమ్మె సైరన్ మోగించేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎవరి ప్రోద్బలంతో నో, భావోద్వేగంతోనో కాకుండా సంయమనంతో ఆలోచించాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగుల పట్ల సానుభూతి ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27…
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధకరంగా ఉన్నాయన్నారు.భాష అదుపులో ఉండాలి. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారన్నారు. ఉద్యగులకు కావాల్సింది ఘర్షణా లేక సమస్యల పరిష్కారమా..? వారే నిర్ణయించుకోవాలన్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడితే తీవ్ర…
పోర్టులు, ఎయిర్‌పోర్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణ పనుల పురోగతి పై సీఎంకు అధికారులు వివరాలందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు జిల్లాలో 6 విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయి. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెఫ్ట్ అని, వన్ డిస్ట్రిక్ట్ – వన్ ఎయిర్‌పోర్టు ఉండాలని ఆయన అన్నారు. దానికి…
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.టీడీపీ 43% పిఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొడి…
ఏపీలో పీఆర్సీపై రగడ నడుస్తోంది. కొన్ని నెలలు 11వ పీఆర్సీపై కసరత్తు చేసిన జగన్ సర్కార్ ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించింది. సీఎం జగన్ తో జరిగిన భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ప్రధాన అంశాలను పరిష్కరించారని వెల్లడించారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రకటించిన జీవో ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల వేతనం విషయంలో…
ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం రూ. 62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కరోనా లేకుంటే రూ. 90 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది. బడ్జెట్-పీఆర్సీని సమన్వయం…