తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగ సంఘాలు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దును వ్యతిరేకిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అంటున్నారు ఉద్యోగ సంఘాలు.
సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దు ను వ్యతిరేకిస్తున్న సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సహకరించాలని కోరుతున్నా ఉద్యోగ సంఘాలు మాత్రం తాడోపేడో తేల్చుకుంటామంటున్నాయి.
Also Read
ప్రస్తుతం అందుతున్న జీతాలు తగ్గకుండా ప్రొటెక్ట్ చేశాం అంటున్న ప్రభుత్వం మాటను ఉద్యోగులు వింటారా? రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిన తర్వాత కూడా సీసీఏ కింద అదనపు లబ్ది అవసరం లేదని సిఫార్సు చేసింది సీఎస్ కమిటీ. కేంద్ర వేతన సంఘం కూడా సీసీఏ రద్దుకు సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఏం తేల్చబోతున్నారు. సీఎంఓ అధికారులతో సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జీవోలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన బాటలో వెళతాం అని సీఎంఓ అధికారులకు స్పష్టం చేయనున్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు. చివరాఖరిగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు భవిష్యత్ కార్యాచరణ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!