ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం తగదు : సీపీఐ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచాలేకానీ… బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. తిరుపతిలోని స్థానిక బైరాగి పట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చుతున్న నేపథ్యంలో ఖమ్మం నందు ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ఉద్యమ విరమణకు ప్రయత్నించగా తెలంగాణ ప్రజలు, ఊస్మానియా వర్శిటీ విద్యార్థులు తిరగబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఉద్యమాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. అదే పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుందని చెప్పారు. ఎన్జీవో నాయకత్వంలో ఉద్యోగుల తిరుగుబాటు తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని తెలిపారు.
ఉద్యోగ సంఘాలను నయానో… భయానో…. ఒప్పించిన జగన్ ప్రభుత్వం వారిని సంతృప్తిపరచలేకపోయిందని విమర్శించారు. ఉద్యోగులు తమకు వచ్చే బెనిఫిట్స్ ను ఎప్పటికీ వదులుకోరని చెప్పారు. గతంలో కంటే మెరుగైన ఫిట్మెంట్, ఇతర బెనిఫిట్స్ ను ఆశిస్తారని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంతో అనుకూల ధోరణితో కానీ… పదవి విరమణ వయసు పెంచడం వల్ల కానీ ప్రభుత్వ నిర్ణయాలను అంగీకరించి ఉండవచ్చన్నారు. కానీ బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడితే తిరగబడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఒకవైపు నిత్యావసరాల ధరలు పెంచుతూ…. మరోవైపు బెనిఫిట్స్ ను తగ్గిస్తామంటే ఉద్యోగులు తిరగబడక ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా బెనిఫిట్స్‌ను కల్పించాలని డిమాండ్ చేశారు.
Also Read
- AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
- Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
- Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
- Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!