ఆ యువ ఎమ్మెల్యేకు హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా.. లేక ఆశలకు కత్తెర వేసిందా? ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి.. వచ్చిన పదవివల్ల కలిగే లాభనష్టాలేంటి? కేడర్‌లో భిన్నవాదనలెందుకు? ఏ విషయం వారికి అంతుబట్టడం లేదు? అమర్నాథ్‌కు పార్టీ పరంగా కీలక బాధ్యతలువిశాఖజిల్లాలో పార్టీ పటిష్టతపై YCP స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికారపార్టీకి 11మంది శాసనసభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. రెండున్నరేళ్లు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు…
కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్‌కు దూరదృష్టి లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉంది.విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం బాధ్యతారాహిత్యం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత…
తెలుగురాష్ట్రాల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల కట్టడి/నియంత్రణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైందో అందరికీ తెలిసిన విషయమే. అదే తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్ళు అమాయకులను సాధారణ వ్యక్తి మొదలుకొని…
ఆ సీనియర్ ఎమ్మెల్యేకు సొంతపార్టీ నేతలే దూరం జరుగుతున్నారా? ఎమ్మెల్యే వద్దన్న వారికి పార్టీ పెద్దలు పట్టం కడుతున్నారా? ఎన్నికల తర్వాత కేడర్‌తో.. లోకల్ లీడర్లతో ఎందుకు గ్యాప్ వచ్చింది? ఆనంతో విభేదించిన పార్టీ నేతలకు బుజ్జగింపులునెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. సంచలన కామెంట్స్‌తో అధికారపార్టీని కలవరపెడుతున్న ఆయనపై.. లోకల్ వైసీపీ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో ఆనం గెలుపుకోసం పనిచేసిన నాయకులు.. కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేకు దూరం జరుగుతున్నారు. వెంకటగిరి వైసీపీ వర్గాలుగా…
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గత రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ చిత్రంలో పెరిగినట్టు తోపుదుర్తి ఆస్తులు పెరిగాయని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే తోపుదుర్తి తనదైన రీతిలో మరోసారి కౌంటరిచ్చారు.
కడప జిల్లాలో పండుగ వేళ ప్లెక్సీ వివాదం అధికార పార్టీ నేతల మధ్య గొడవలను బయటపెట్టింది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. అది కాస్త పోలీస్ కంప్లైంట్ల వరకు వెళ్లింది. భోగి మంటలతో సంతోషంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్లెక్సీ సెగలు పుట్టించింది. ఈనెల 16న జరగనున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టిన రోజు కోసం ఆయన అనుచరుడు…
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా అదుపులో వుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.సంక్రాంతి శెలవుల తర్వాత స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యాయి. ఎంత మంది వచ్చారనే అటెండెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు. గత రెండేళ్లల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాం.విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇస్తున్నాం.సుమారు 22 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసేశాం.విద్యార్ధులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తైంది.టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ వేశాం.ఎకడమిక్ ఇయరుని ముందుగా నిర్ణయుంచుకున్న…
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సందర్భంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు తాను లేఖ రాశానని లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయని ఏపీ ప్రభుత్వానికి లోకేష్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయని లోకేష్ వివరించారు. Read Also: విద్యార్థులకు అలర్ట్..…
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ సీటు కోసమే చిరంజీవి జగన్‌తో సమావేశమయ్యారంటూ వివిధ కోణాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. ప్రజలకు నిజాలు చెప్పండి అని నారాయణ అన్నారు. కనుమ పండుగ రోజు కూడా కఠోర వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి…
కోడిపందాలు జూదం కాదు.. సంస్కృతిలో భాగమని వైసీపీ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆదివారం ఆయన ఏపీ ప్రజలందరికీ కనుమ పండుగ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్కృతి, చట్టాలను రెండింటిని గౌరవించాలని, కోడి పందాలు సంప్రదాయంగా చట్టబద్ధంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు కేటాయిస్తోందిని, ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా యాజమాన్య హక్కులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు…