కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించింది. ఏపీలో మాత్రం విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులకు ప్రకటించకుండా.. నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించింది. అలాగే మద్యం దుకాణాలకు ఒక గంట సమయం మినహాయింపు ఇచ్చింది. దీంతో జనసేనాని పవన్ వైసీపీ ప్రభుత్వంకు చురకలు అంటించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న తగ్గేవరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని కోరారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలు మరో గంటపాటు అదనంగా తెరిచిఉంచాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఈ ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి, వైద్య సేవలు ఎలా మెరుగుపరచాలని కాకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు.