ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో…
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళదామని అనుకుంటున్నారా? అయితే కాసేపు ఆగండి. గతంలోలాగా దర్శనానికి వెళితే ఇబ్బందులు తప్పవంటున్నారు దేవస్థానం అధికారులు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా శ్రీశైలంలో ఆన్ లైన్ విధానం పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు చేపట్టారు. ఈనెల 25 నుంచి ఉచిత దర్శనం , రూ.150, రూ.300 దర్శనం, ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే పొందాలని ఈవో లవన్న తెలిపారు. భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ ధ్రువ పత్రం ఆన్ లైన్ లో…
సీఎం జగన్ పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ప్రయత్నించారని, కేరళ కూర్గ్ లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు…
జగన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆత్మకూరు లో ముందస్తు ప్రణాళికతో దాడి చేశారని, ప్రజా వ్యతిరేక విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎమ్మెల్యే శిల్ప, హఫీజ్ ఖాన్, డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ కుట్రదారులుగా ఆయన అభివర్ణించారు. ఆత్మకూరులో మసీదు నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారని, ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మిస్తామంటే ఓర్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. స్థానికులు ఒప్పుకుంటేనే…
తనపై వస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తాను రాజీనామా చేయనని, చంద్రబాబుని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాసినోలపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వస్తే క్యాసినోలో ఏం జరిగిందో చూపిస్తానన్నారు.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఏపీలో…
ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు గుప్పించారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్…
కరోనా ఏ రాష్ట్రాన్నీ వదలడం లేదు. నెల క్రితం వందల్లో వున్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. తాజాగా ఏపీలో కరోనా భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, విశాఖ, చిత్తూరు జిల్లాలలో కరోనా కట్టడిపై అధికారులు చేతులెత్తేశారేమో అనిపిస్తోంది. జిల్లాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు, తెరుచుకున్న సినిమా థియేటర్లతో పాటు సందడి ఎక్కువైంది. మూడు నెలలుగా కరోనా కొత్త వేవ్ వస్తుందని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా అధికారులకు మాత్రం చీమ…
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు.…