సీఎస్ సమీర్ శర్మపై మరోసారి విరుచుకుపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ. ఉద్యోగుల తరపున సీఎంతో సంప్రదింపులు జరపాల్సిన వ్యక్తి సీఎస్సే. పీఆర్సీ విషయంలో సీఎస్ తన బాధ్యతల్లో విఫలమయ్యారని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా అన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ప్రద్యుమ్న నన్ను తప్పు పట్టారు.సీఎస్ విషయంలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయం నా ఒక్కడిదే కాదు.. పీఆర్సీ సాధన సమితి…
ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో… నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసే జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. Read Also: ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదు: పీఆర్సీ సాధన సమితి ఇది చాలా కాలంగా…
ఏపీలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు రూ.589 కోట్లను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ పథకం అగ్రవర్ణాల పేద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. Read Also:…
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ★ బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు…
ఏపీలోని మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆర్ధికంగా వెనుక బడిన వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా ఏటా మహిళలకు రూ.15వేలు నగదును అందిస్తున్నారు. ఈ పథకాన్ని ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఉ.11 గంటలకు వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభిస్తారు. Read Also: ఏపీ విద్యాశాఖ కీలక…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందా? ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన…
క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి కొడాలి నాని. చెత్తకాగితాలు తెచ్చి ఇవిగో ఆధారాలు అంటున్నారు. మంత్రి పదవి నుంచి తప్పించాలన్నదే టీడీపీ నేతల ప్రయత్నం. కరోనా వచ్చి ఆస్పత్రిలో వుంటే నన్ను టార్గెట్ చేశారని విమర్శించారు. కే కన్వెన్షన్ లో కేసినో జరిగినట్టు నిరూపించాల్సిందే. టీడీపీ నిజనిర్ధారణ కమిటీలో వున్నది ఎవరు? కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో నిందితులుగా వున్నవారు ఆ కమిటీలో వున్నారన్నారు నాని. బోండా ఉమ పిచ్చిపిచ్చి…
ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు. గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించాం. పరిష్కార మార్గాలను అన్వేషించాం. సమావేశం చాలా సానుకూలంగా జరిగింది. త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు గుడివాడ ఘటనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుడివాడలో ఎలాంటి క్యాసినో జరగలేదని, విపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినో వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. క్యాసినో ఎక్కడ జరిగినా జరిగింది వాస్తవమా కాదా?…