ఏపీలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ఈరోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకు రూ.589 కోట్లను ప్రభుత్వం ఈ పథకం కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ పథకం అగ్రవర్ణాల పేద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Read Also: చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు: శ్రీకాంత్ రెడ్డి
ఈ పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, క్షత్రియ, వెలమ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఏటా రూ.15వేల ఆర్థిక సాయం చేకూరుతుందని జగన్ వివరించారు. రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం చేపట్టామని… మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు ప్రారంభమైందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టకపోయినా పేదవారిని ఆదుకోవాలనే ఉద్ధేశంలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.