ఏపీలోని మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆర్ధికంగా వెనుక బడిన వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా ఏటా మహిళలకు రూ.15వేలు నగదును అందిస్తున్నారు. ఈ పథకాన్ని ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఉ.11 గంటలకు వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభిస్తారు.
Read Also: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇకపై పాఠశాలల్లో అవి రద్దు
ఈ మేరకు రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఈరోజు రూ.15వేల నగదును వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద మూడేళ్ల పాటు రూ.45వేల ఆర్థిక చేయూతను ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ద్వారా 3,92,674 మంది మహిళలు లబ్ది పొందనుండగా.. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కోసం జగన్ ప్రభుత్వం రూ.589 కోట్లు ఖర్చు పెట్టనుంది.