ఏపీ ప్రభుత్వం పాలనలో మరో ముందడుగు వేసింది. సచివాలయాల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ సాయంతో ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయని సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేపట్టిన ఆయన పోర్టల్ ఏర్పాటుతో ప్రజలు స్వయంగా తమ అప్లికేషన్ స్టేటస్‌ను…
ఏపీలో నిర్వహించిన 73వ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎస్ అధికారులతో సీఎం జగన్ ముచ్చటించారు. Read Also: జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు… జిల్లాల విభజనపై పలుచోట్ల నిరసనలు ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవగానే…
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పులో కాలేశారు. టంగ్ స్లిప్ కావడంతో సీఎం జగన్‌కు బదులు మాజీ సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… కరోనా కట్టడికి సీఎం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు, సచివాలయాల కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కోవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం…
ఏపీలో 13 కొత్తజిల్లాలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గతంలో వున్న 13 జిల్లాలకు ఇవి అదనం. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అనంతపురం జిల్లాలో వున్న ప్రముఖ పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు శుభపరిణామం అన్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల ఉద్యోగ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్ వి జానకీరామయ్య ఆకాంక్ష…
ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రభుత్వం తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Read Also: ఏపీలో కొత్త…
ఏపీలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 13 జిల్లాలు ఆవిర్భావం కానున్నాయి. ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 15 కొత్త రెవెన్యూ…
విజయవాడ ఉంగటూరు పోలీస్ స్టేషన్ ఉంగటూరు పోలీస్ స్టేషన్ నుండి సోము వీర్రాజు విడుదల అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దెబ్బకి వైసీపీ ప్రభుత్వం, మంత్రి ఓడిపోయాడన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్ముల్ని ఆపాలని చూశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరపాలో మా కార్య కర్తలు గుడివాడ నానికి చూపించారని చురకలు అంటించారు. ఢిల్లీలో తోకలు పట్టుకుని తిరిగే పార్టీలు మాపై కామెంట్లు చేస్తున్నాయన్నారు.…
ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు.…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ…