ఏపీలో పీఆర్సీ వివాదం పీటముడి వీడడం లేదు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనల పై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం అన్నారాయన. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని…
ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారు. చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదు.ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టం.మేం ఇచ్చిన లేఖకు సమాధానం…
అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్‌వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు…
ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి స్వాగతించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి…
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండాలనేది బీజేపీ విధానమని అన్నారు. వాస్తవానికి 2014 మేనిఫెస్టోలోనే 25 జిల్లాల ఏర్పాటు గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల్లో విలీనమయ్యే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని వీర్రాజు సూచించారు. ‘‘ఇప్పటికే మా పార్టీ…
ఇటీవల జగన్ సర్కార్ ప్రకటించిన నూతన జిల్లాల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నూతన జిల్లాల అంశంపై టీడీపీ అధినేత పలు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నూతన జిల్లాల్లో ఓ జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానిగా నేను ఎంతో సంతోషిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా నా తరపున, ఎన్టీఆర్ ను దైవంగా భావించే…
ఏపీ ప్రభుత్వం ఇటీవల 13 కొత్త జిల్లాల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ 26 జిల్లాల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చంద్రబాబుకు 26 కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలోనే కొత్త జిల్లాలు నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి జగన్…
ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన అంశం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారన్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని, సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని, ఎన్టీఆర్ ను…
శ్రీ సిటీలో నోవా ఎయిర్ ప్లాంట్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో మెడికల్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్‌నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. రోజుకు220 టన్నుల ఆక్సిజన్ తయారీ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ఉద్దేశమన్నారు. కేవలం 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం…
ఓ వైపు పీఆర్సీ పై చర్చలు కొనసాగుతుండగానే ఏపీ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్య్కూలర్‌ను జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించింది. సర్య్కూలర్ ప్రకారం నిర్దేశిత గడువులోగా జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియను చేపట్టకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది. డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని స్పష్టం…