సీఎస్ సమీర్ శర్మపై మరోసారి విరుచుకుపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ. ఉద్యోగుల తరపున సీఎంతో సంప్రదింపులు జరపాల్సిన వ్యక్తి సీఎస్సే. పీఆర్సీ విషయంలో సీఎస్ తన బాధ్యతల్లో విఫలమయ్యారని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా అన్నారు.
పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ప్రద్యుమ్న నన్ను తప్పు పట్టారు.సీఎస్ విషయంలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయం నా ఒక్కడిదే కాదు.. పీఆర్సీ సాధన సమితి నేతలందరిదీ.సీఎస్ సమీర్ శర్మపై నేను చేసిన వ్యాఖ్యల విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. నేను ఎదుర్కొవడానికి సిద్దమే అన్నారు సూర్యనారాయణ.
మరోవైపు మూడు కీలక అంశాలతో వినతి పత్రం ఇచ్చారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. నలుగురు నేతలు బండి శ్రీనివాస రావు, బొప్పరాజు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ సంతకాలతో పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ తరపున లేఖ అందచేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టాలని, పీఆర్సీ జీవోలను అభయెన్స్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. జనవరి నెలకు పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని, ఈ డిమాండ్లను పరిష్కరిస్తే చర్చలకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీంతో పీఆర్సీ ఉద్యమం తారస్థాయికి చేరిందనే చెప్పాలి.