ఛలో విజయవాడ నిరసనకు బయలుదేరిన ఉద్యోగ సంఘాల నేతల్ని నిర్బంధిస్తున్నారు పోలీసులు.ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అక్రమ అరెస్టులపై నిరసన వ్యక్తం అవుతోంది. అరెస్ట్ ఎలా చేస్తారు అంటూ నిల దీస్తున్నాయి ఉద్యోగసంఘాలు…? మాకు రైట్ ఉంది అంటున్నారు పోలీసులు. దీంతో బెజవాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె కేసుకి సంబంధించి హైకోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ ఊరట కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన…
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు.…
ఏపీలో పీఆర్సీపై ప్రభుత్వానికి, పార్క్ సాధన సమితికి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సందర్బంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… అశాస్త్రీయంగా.. అసంబద్దంగా పీఈర్సీ జీవోలు జారీ చేశారని అన్నారు. చర్చలు పూర్తయ్యాక కొత్త జీవోలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆయన మండిపడ్డారు. కొత్త జీతాలు వద్దంటూ ఉద్యోగులంతా రిక్వెస్ట్ లెటర్లు పెట్టారని, సస్పెండులో ఉన్న వాళ్లకి.. చనిపోయిన వాళ్లకు.. రిటైరైన వాళ్లకు జీతాలు వేసేశారని…
పీఆర్సీ సాధనకు ఉద్యోగులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. బుధవారం చేపట్టిన ఛలో విజయవాడను విజయవంతం చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. పోలీసులు వారిని నియంత్రించే పనిలో వున్నారు. ఈ నెల మూడో తేదీన ఛలో విజయవాడకు పీఆర్సీ సాధన సమితికి అనుమతి నిరాకరిస్తున్నామన్నారు విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా. ఛలో విజయవాడ నిర్వహణ చట్టపరంగా విరుద్దం.ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదు. కరోనా నిబంధనల కారణంగా ఛలో విడయవాడకు అనుమతి…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీలో ఆఫీసు ఎక్కడ పెడుతుంది? కేంద్రం ఆలోచనేంటి? అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న లేఖ రాశారు. దీనిపై ఆర్‌బీఐ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సందిగ్ధత ఏర్పడింది. మూడురాజధానుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాజధాని విషయం ప్రభుత్వం నిర్ణయించిన…
చేసిన అప్పులు ఎలా తీర్చాలో జగన్ కు తెలుసని , సీఎంగా వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతి శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా…
ఏపీ పీఆర్సీ రగడ సామాన్య ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలు అంటూనే .. తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు నేరవేరిస్తేనే చర్చలకు వెళ్తామంటూ భీష్మించుకుని ఉన్నారు. దీంతో సగటు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఇంకా జీవో ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొన్నది. Read Also: ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ ఇప్పటికే ఆయా…
వైసీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళా ద్రోహి అంతో వంగలపూడి వనిత ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని ఆమె అన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని, ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు.…
ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులన్నీ దుబారా చేశారని, పట్టపగలే ప్రజాధనాన్ని నిలువుదోపిడీ చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అందుకే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఆర్ధిక నిపుణులు పేర్కొన్నట్లుగా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు ఏపీలో తక్షణావశ్యకం ఉందన్నారు. రాష్ట్రంలో గతితప్పిన ఆర్ధిక పరిస్థితిని…