డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి రిలీఫ్.. అప్పీలేట్ అథారిటీ కీలక ఉత్తర్వు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె కేసుకి సంబంధించి హైకోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ ఊరట కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన కొండదొర సామాజికవర్గమని పేర్కొంది. దీంతో ఆమెకు పెద్ద ఊరట లభించినట్టయింది.. పుష్ప శ్రీవాణి గిరిజన మంత్రిగా వున్న సంగతి తెలిసిందే. ఆమె ఎస్టీ కాదని హైకోర్టులో రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ జరిపింది. ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీలేట్ అథారిటీ ద్వారా విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం ఆమె ఎస్టీ అని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..
- CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!
- CM Chandrababu : కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
- CM Chandrababu : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగాలి
తాజావార్తలు
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..