ఏపీలో పీఆర్సీపై ప్రభుత్వానికి, పార్క్ సాధన సమితికి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సందర్బంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… అశాస్త్రీయంగా.. అసంబద్దంగా పీఈర్సీ జీవోలు జారీ చేశారని అన్నారు. చర్చలు పూర్తయ్యాక కొత్త జీవోలు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆయన మండిపడ్డారు. కొత్త జీతాలు వద్దంటూ ఉద్యోగులంతా రిక్వెస్ట్ లెటర్లు పెట్టారని, సస్పెండులో ఉన్న వాళ్లకి.. చనిపోయిన వాళ్లకు.. రిటైరైన వాళ్లకు జీతాలు వేసేశారని ఆయన అన్నారు.
మేం అడిగాం కాబట్టే పంతంతో జీతాలు వేశారని, గతంలో ఏ ఒక్క నెల ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు వేయలేదని ఆయన తెలిపారు. ఇప్పుడు మాత్రం పట్టుదలతో ఠంచనుగా జీతాలు వేసేశారన్నారు. మా డీఏ బకాయిలను కలిపి పే-స్లిప్పులను చూపారని, తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రేపు ఛలో విజయవాడ కార్యక్రమం అయితే.. నిన్నటి నుంచే అరెస్టులు దేనికీ..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు బయటకొచ్చి అడిగే అధికారం లేదు.. మాకు ఆ హక్కుంది.. మమ్మల్ని అడగనివ్వండి అని ఆయన అన్నారు.