ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సీఎం జగన్ మనసు విప్పి మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని సీఎం జగన్ కోరారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. ఉద్యోగులు లేకపోతే తాను లేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
ఏపీ ప్రభుత్వంపై జరిగిన చర్చలపై ఉద్యోగులు హ్యాపీగా వున్నారన్నారు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి. ఫిట్ మెంట్ తప్ప మిగిలిన డిమాండ్లు మాకు సానుకూలంగా నే ప్రభుత్వం స్పందించింది. పదేళ్ల పీఆర్సీ బదులు ఐదేళ్ల పీఆర్సీని మేం సాధించుకున్నాం. హెచ్ ఆర్ ఎ శ్లాబుల్లో తెలంగాణతో సమానంగా సాధించుకున్నాం. మా నుంచి రూ.5400 కోట్లు రికవరీని ప్రభుత్వం ఆపేసింది. నిన్నటి చర్చల్లో ఏడాదికి 1500 కోట్లు అదనంగా ప్రభుత్వం నుంచి రాబట్టాం. సీఎంది చాలా పెద్ద…
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చుపెడుతుంది. దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాల కు సమానంగా ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తోంది. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37,458 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది 33,102 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదికలో తేలింది.ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన నివేదిక…
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ. హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించారు. ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో…
ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని, ఈరోజు, రేపటి లోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రెండు రోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుంది. టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు అప్పజెప్పి వెళ్లారు. అన్నీ సమస్యలు పరిష్కరించాం, రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తాం. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. ఆయన…
ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ అంశంపై ఒక నిర్ణయానికి రానుంది ప్రభుత్వం. సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో పది గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. నిన్న స్టీరింగ్ కమిటీ లో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనుంది మంత్రుల కమిటీ. హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులు, సీసీఏ రద్దు, మట్టి ఖర్చులు అంశాలపై ఖజానా పై పడే ఆర్ధికభారం, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడాన్ని లేఖలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఏపీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం భారీగా కోల్పోయింది. రాష్ట్రాన్ని కేంద్ర సహకారం చాలా అవసరం. పోలవరం నిధులు, రెవెన్యూ లోటు సహా ఇతర అంశాలకు…
ఏపీలో కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,00,622 పాజిటివ్ కేసులు ఉండగా… ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు కేవలం 2,301 మందేనని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. రెండు…
నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. భారత్ ను కొద్దిమంది వ్యక్తులకు అమ్మివేసే బీజేపీ నేతలు దేశ ద్రోహులు అని ఆయన ఆరోపించారు. అడవులను అటవీ సంపదను, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, రైల్వే ను విమానాలను అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజులు పరిపాలించాలి, డబ్బు అంతా బడా బాబుల వద్ద ఉండాలన్న విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. అదాని అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు బీజేపీ…
ఏపీలో పీఆర్సీ పై మండిపడుతున్న ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ పట్టువీడాలని ప్రభుత్వం కోరుతూనే వుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు. ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి.. ఇలాంటి ఆందోళనలు మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు తల్లి లాంటిది.. ఉద్యోగులకు సీఎం జగన్ తప్పకుండా మేలు చేస్తారని ఆశాభావం వ్యక్తం…