ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు.…
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల…
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలను చల్లబరిచే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ అదిరే శుభవార్త అందించారు. పీఆర్సీ వల్ల హెచ్ ఆర్ఏ తగ్గిందని భావించే ఉద్యోగులకు ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ ని రెట్టింపు చేసేసింది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసిన తరుణంలో.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ…
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి పంచాయతీ సమావేశంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం వద్దకు వచ్చిన ఒక వర్గానికి చెందిన సర్పంచి భర్త ఆళ్ల శ్రీను. రెండో వర్గానికి చెందిన దాసరి శ్రీశైలం సైతం సమావేశం వద్దకు వెళ్లడం వివాదానికి దారితీసింది. సమావేశానికి బయట వ్యక్తులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు వార్డు సభ్యులు. దీంతో చెలరేగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ బయటకు వచ్చాక రెండు వర్గాల మహిళా వార్దు సభ్యుల…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను…
మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు.…
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న…
ఏపీలో మళ్ళీ మూడురాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో….మూడు రాజధానులు అదే విధంగా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయం అని ధీమాగా చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ఊహలు, అయోమయంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో…!? వ్యతిరేకమో చెప్పాలన్నారు. చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగానే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. సీఎంకు గిరిజనులపై…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. విశాఖలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మించాలని కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా కళాశాల లేకుండా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. కేవలం ఆసుపత్రి నిర్మాణానికి రూ. 400 కోట్లు నిధులు కేంద్రం కార్మిక శాఖ మంజూరు చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్ధలం సేకరించి ప్రతిపాదనలు…