జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని.. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతిస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా ఉందని జగన్ విమర్శించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు అని.. కానీ చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే సమ్మెలు, ఆందోళనలు చేయడం…
ఏపీలో జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు రూ.285.35 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. Read Also: మహేష్‌బాబుతో…
ఏపీలో మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం. ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఉగాదికి ఇంకా…
పీఆర్సీ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులూ ఒకే టీం. సమస్యలు ఇరు పక్షాలకూ తెలుసు. కాబట్టి దీనిలో విజయం, వైఫల్యం అంటూ ఏమీ లేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్‌ప్రెషన్ గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏళ్ళ కిందట ఉన్న దగ్గరే ఆగిపోయిందన్నారు సజ్జల. 80 వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు…
సీఎం జగన్ పాలనపై విపక్ష నేతలు మండిపడుతూనే వున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలీస్ యూనిఫాం కోసం మహిళా పోలీసులకు జంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం దారుణం అన్నారామె. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా? వైసీపీ పాలనలో మహిళలకే కాదు.. మహిళా పోలీసులకూ రక్షణ కరువైంని అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ వల్లే మహిళలకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయన్నారు.…
శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ శ్రీరామానుజ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే తాజాగా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజ సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సీఎం…
ప్రస్తుతం టాలీవుడ్ కొన్ని సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గతకొన్నిరోజుల నుంచి ఏపీ లో టిక్కెట్ ధరల విషయమై చర్చ నడుస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం ఏపీ టిక్కెట్ రేట్లు తగ్గించడంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేయడం, పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలపడం. ఇక వాటన్నింటిని ఆపడానికి ఇండస్ట్రీ పెద్దగా కాకుండా ఇండస్ట్రీ బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ని కలవడం జరిగాయి. ఆ సమావేశంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన…
ఏపీలో పీఆర్సీ విషయంలో కొన్ని సంఘాలు సంతృప్తిగా వున్నా యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఈ పీఆర్సీతో సంతృప్తి చెందలేదన్నారు. సమావేశ హాజరు పట్టీ సంతకాలను ఒప్పందంపై సంతకాలుగా చూపిస్తున్నారన్నారు. ముగిసిపోయిన అధ్యాయం అని మంత్రులు అన్నారు సీఎం అభిప్రాయం మేం ప్రకటించాం.. సీఎం కు చెప్పేదేం లేదన్నారు.అహంకారం గా మాట్లాడే తీరు మార్చుకోవాలన్నారు. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా…
వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. రజక, నాయీబ్రహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న కానుకను ఈ ఏడాది కూడా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా రూ.285.35 కోట్ల ఆర్థిక సాయంను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు బటన్ నొక్కి లబ్దిదారుల లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 చొప్పున ఆర్థిక సాయాన్ని ఏపీ…