త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇంఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది.
శివరాత్రి, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్ధి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి అమ్మవారి వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. దర్శనంతరం మంత్రి కారుమూరి.. బయటికొచ్చి ఎన్టీవీతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ సింగిల్ గా వస్తారు... పొత్తులు పెట్టుకోరని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిలో 2 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గొంతెరు డ్రైన్ పై బ్రిడ్జ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ( Grandhi Srinivas ) ప్రారంభించారు.
నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. నా కూతుళ్ళకు రాజకీయాలలో ఆసక్తి లేదు.. రాజకీయాలలో ఆసక్తి ఉంటే నా తమ్ముడి కొడుకు వస్తాడేమో అని తెలిపారు.
అభివృద్ధి లేకుంటే తలసరి ఆదాయం పెరగదు అని ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) అన్నారు. తలసరి ఆదాయం, రాష్ట్ర స్తూల ఉత్పత్తి లో ఏపీ ముందుంది.. రామాయపట్నం పోర్టును సీఎం జగన్ ( cm jagan ) చేతుల మీదుగా శంఖుస్థాపన చేసి ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు.
తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. రేవంత్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. సీఎం రేవంత్ అంటూ ఆయన…
ఈ ఎన్నికలు రాష్ర్ట భవిష్యత్ కు కీలకమైనవి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవ్వడం చారిత్రక అవసరం ఉందని పేర్కొన్నారు.
రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నాను తెలిపారు. బలిజలంటే జగన్ కు ద్వేషం.. నాకు గతంలో అండదండగా ఉన్న పెద్దిరెడ్డి నాపై చేసిన విమర్శలను పట్టించుకోను.. ఆయనను విమర్శించే స్దాయి నాకు లేదు.. కానీ, నాపై విమర్శలు చేస్తున్న ప్రస్తుత వైసిపీ అభ్యర్ధికి భవిష్యత్తులో సమాదానం చెబుతాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాదు ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మిటన్ ప్లేయర్ సైనా…