టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే.. ! నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పలు నిర్ణయాలను ( key decisions ) టీటీడీ ( TTD ) తీసుకుంది. ఈ సందర్భంగా స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోగా.. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మాణానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా.. టీడీపీ, జనసేన, బీజేపీలు ( TDP- Janasena- BJP ) కలిసి పోటీ చేసి ఎంపీగా గెలిచినా అందరూ మోడీకే ఓట్లేస్తారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ఆరోపించారు.
నరహంతకుడు మోడీ అని చెప్పి ఇప్పుడు ఆయన చుట్టూ చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. 2014 ముగ్గురూ కటయ్యారు.. 2019లో విడిపోయారు.. జగన్ ను ఓడించాలానే లక్ష్యంతోనే మళ్లీ ముగ్గురూ కలుస్తున్నారు.. ప్రతి సర్వేలో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుందని వెల్లడవుతోంది..
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు.
నేడు ఖమ్మంకు రేవంత్.. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది.. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇవాళ (సోమవారం) కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద…
నేడు పులివెందుల, ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Y.S. Jagan Mohan Reddy ) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు.
నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం. వర్చువల్‌గా రహదారులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఏపీలో కడప-బెంగళూరు కనెక్టివిటీ హైవే ప్రారంభం. ఏపీలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో…
ఆ సినిమాలో అన్నీ బూతులే.. కానీ, డబ్బులు బాగా వచ్చాయి తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి,…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా..
రానున్న ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందని అన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తానని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు. కాగా.. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు.. పార్టీ కష్టకాలంలో వదిలేసానని అపవాదు తనపై రాకూడదని చెప్పారు. మూడు రోజుల క్రిందట తాను ముఖ్యమంత్రిని కలిసానని.. ఈసారి తనను ఎంపీకి పోటీ చేసి తమ బాబుని అసెంబ్లీకి పంపిద్దామని తనతో సీఎం చెప్పినట్లు తెలిపారు.