ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
బెజవాడలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇక్కడ అభిమానుల ఆనందం చూస్తుంటే అవినాష్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.
గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు అని నెల్లూరు లోక్ సభ వైసీపీ సమన్వయకర్త విజయ సాయి రెడ్ది తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు..
పసిడి ప్రియులకు భారీ ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు .. ఎంతంటే? పసిడి ప్రియులకు భారీ ఊరట… ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి .. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి.. పది గ్రాముల బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర…
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక…
1. నేడు పశుసంవర్థకశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మధ్యాహ్నం సెక్రటేరియట్‌లో అధికారులతో సీఎం సమావేశం. 2. నేడు సాయంత్రం యూపీలో మంత్రి వర్గ విస్తరణ. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న దారాసింగ్, ఓం ప్రకాష్. ఆర్‌ఎలడీ నుంచి రాజ్‌పాల్‌కు మంత్రి పదవి. 3. నేడు విజయవాడకు మానవ హక్కుల కమిషన్. కమిషన్ చైర్‌పర్సన్ అరుణ్ మిశ్రాతో పాటు కమిషన్ సభ్యుల పర్యటన. ఫిర్యాదులపై రేపు విచారణ చేయనున్న కమిషన్? 4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10…
సీఎం జగన్ (CM Jagan) బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. విజయవాడలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మంత్రి రోజాకు (RK.Roja) సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మళ్లీ రోజాకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిస్తామని వైసీపీ అధిష్టానానికి రోజా వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరించారు.
కేంద్రం జోక్యంతో భారతీయ యాప్‌ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్.. సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్‌లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్‌లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం గూగుల్ 10…