1. నేటి నుంచి భక్తులకు శ్రీవారి మెట్టుమార్గం అందుబాటులోకి రానుంది. టీటీడీ నేటి నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతించనుంది.
2. నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా.. బండి సంయ్ ప్రజా సంగ్రామ యాత్ర సభకు హజరుకానున్నారు.
3. నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యాదీవెన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
4. నేడు తాళ్లవలసలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.
5. నేడు పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనన్నారు.
6. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,280లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,000లుగా ఉంది.
7. నేడు ఐపీల్ సీజన్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ నేడు రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది.