ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని.. జూలై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని.. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. గోదావరిలో వరద16 లక్షల క్యూసెక్కులకు…
అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి క్యేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో రెండోసారి గెలిచాక కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అనిల్‌కు.. మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు చాలా తేడా ఉందనేది…
విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టగా స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనవాణి కార్యక్రమం ద్వారా తాము చేస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు తన బాధ్యతలను మర్చిపోయిందని.. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు నేడు నలిగిపోతున్నారని పవన్ ఆరోపించారు. తాను సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానని భరోసా ఇచ్చారు.…
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలలో భాగంగా ఈనెల 12న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఏపీ పర్యటనలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం జగన్ నివాసంలో ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఏర్పాటు…
వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని…