చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. వైసీపీ ప్లీనరీకి 9 లక్షలమంది వచ్చారన్నారు. పోలీసులు, వాలంటీర్లు, ఆరోగ్య కార్తకర్తలు, నేతలు, మీడియా అద్బుతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. జనసంద్రంగా ప్లీనరీ మారటం అందరూ చూశారు. పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం గా ప్లీనరీ జరిగిందన్నారు విజయసాయిరెడ్డి.
అణగారిన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్బీకేలు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాం. ఈ విషయాల్లో ప్రపంచమే మెచ్చుకుంటుంటే చంద్రబాబు భావదారిద్రంతో విమర్శలు చేస్తున్నారు. 4 లక్షల మంది ప్లీనరీ దగ్గర, 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. కానీ ఎల్లో మీడియాకు మాత్రం జనం కనపడలేదు. చంద్రబాబుకి మెదడులో ఉండాల్సిన చిప్ వేలికి వచ్చింది. తరువాత కాలికి వస్తుంది. అల్జీమర్స్ తో బాధ పడుతున్న బాబు ఏమవుతాడోననే భయంగా ఉందన్నారు. టీడీపీ మహానాడులో వైసిపిని తిట్టడం, తొడ గొట్టటమే జరిగాయి.
కానీ మా ప్లీనరీలో మేము ఏం చేశామో? ఇంకా ఏం చేయాలో చర్చించాం.40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు జగన్ని ఎదుర్కోగలడా? నవరత్నాలు ఎలా అమలు చేశామో ప్రజలకి తెలుసు. నవరత్నాలను విమర్శించిన వారి నవరంధ్రాలు మూసుకుపోయేలా ప్లీనరీ కి జనం వచ్చారు. పవర్ లో లేమనే బాధతో చంద్రబాబు ప్రస్టేషన్ లోకి వెళ్లి ఒక శాడిస్టుగా మారాడు. చంద్రబాబు, ఆయన కుల మీడియా జగన్ని విమర్శించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
Sandra Venkata Veeraiah : పేదరికమే గీటు రాయిగా లబ్దిదారులని ఎంపిక
జగన్ ని ఎప్పుడు దించేసి చంద్రబాబు ను సీఎం చేద్దామా అని కుట్రలు పన్నుతున్నారు. కానీ జగన్ వెన్నుపోటుతో అధికారంలోకి రాలేదు. అమరావతి అనేది ప్రపంచంలో అతి పెద్ద స్కాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాడో ఇప్పటికీ లెక్క చెప్పలేదు. నెగటివ్ భావాలతో బాధ పడుతున్న చంద్రబాబు ఇక రిటైర్ అవటమే బెటర్ . చేతగాని వాళ్లు గోబెల్స్ ప్రచారాన్ని ఎన్నుకుంటారు. జగన్ ధైర్యం గా చేసిందే చెప్పుకుంటాడు. ప్లీనరీ జరగకుండా వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు. అలాంటి శాడిస్టు మనస్తత్వం చంద్రబాబుది.
ప్లీనరీకి వచ్చిన దినేష్ చనిపోయారు. పోయిన ప్రాణం తీసుకు రాలేకపోయినా సాయం అందిస్తాం. వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జున పార్టీ తరపున ఐదు లక్షలు సాయం చేస్తున్నారు. ప్లీనరీకి ఆటంకం కలగకుండా పోలీసులు బాగా పని చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జగన్ని ఎన్నుకున్నాం. అంతర్గత ప్రజాస్వామ్యం లేదనటం కరెక్టు కాదు. ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ జగన్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అది పబ్లిక్ గానే జరిగిందని వివరించారు విజయసాయిరెడ్డి.