వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ శాసనసభ వ్యవహారాల సమన్వయకర్తగా ఏపీ ప్రభుత్వం ఆయన్ను నియమించింది. అంతేకాకుండా ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల పాటు శ్రీకాంత్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ఇటీవల జరిగిన క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ జగన్ ఆయనకు బెర్త్ కేటాయించలేదు. ఇప్పుడు మాత్రం…
బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విలేజ్ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం…
సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేయని ఓ ఇంటిని వైసీపీ నేత కబ్జా చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగ పెంటలో మేకల కాపరి మర్రి శ్రీను ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. తమకు ఓటేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ…
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ డేట్ చెప్పాలంటూ విపక్షాలకు సవాల్ విసరడం, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని విపక్షాలు ప్రతిసవాళ్లు విసరడం పొలిటికల్ టెంపరేచర్ ను అమాంతం పెంచేసింది. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. కాంగ్రెస్, బీజేపీ కూడా అగ్రనేతల సభలతో హడావుడి మొదలుపెట్టాయి. వరంగల్ లో రాహుల్ తో రైతు డిక్లరేషన్ ఇప్పించింది కాంగ్రెస్. బీజేపీ ఏకంగా…