వైసీపీ ప్లీనరీలో టీడీపీ అధినేత చంద్రబాబు వేలి ఉంగరంలో చిప్ ఉండటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి బాగోగుల గురించి ఆలోచించే చిప్ మెదడు, గుండెలో ఉండాలి కానీ.. చంద్రబాబు చేతి రింగులోనో, మోకాలిలోనో, అరికాలిలోనో ఉంటే లాభం ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. గుండె, మెదడులోనూ చిప్ ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని జగన్…
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని…