భీమవరం సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సినీనటుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి, ఆ సభలో మా అన్నయ్య చివరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు అంటూ నాగబాబు తాజాగా ట్వీటర్ లో వేదికగా వ్యాఖ్యలు చేసారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి…
ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:10 గంటలకు పార్టీ జెండాను వైసీపీ…
పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు…