గ్రేటర్ విశాఖ నగరం పరిధిలో కొత్త టౌన్ షిప్పులు రానున్నాయ్. ఆరువేల ఎకరాల్లో లే అవుట్ల అభివృద్ధి బాధ్యతను వీఎంఆర్డీఏకి అప్పగించింది ప్రభుత్వం. లక్షా 83వేల కుటుంబాలకు లబ్ధి చేకూరే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. జీవీఎంసీ పరిధిలో నివాస స్ధలాల కోసం ఎదురు చూస్తున్న పట్టణ పేదలకు ఊరట లభించింది.భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభివృద్ధి పనులకు యంత్రాంగం రెడీ అవుతోంది. పది మండలాల పరిధిలో ఇప్పటికే సేకరించిన…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు. అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో…
ఏపీ ప్రభుత్వంలో కొంతకాలం క్రితం వరకూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ అనూహ్యంగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు ఖాకీ డ్రెస్ వదిలేశారు. ఎంచక్కా సూటు వేసుకుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ అధికారిగా గన్ పట్టుకునే చేతితో పెన్ పట్టుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ళ పాటు సర్వీసు ఉన్నప్టికీ సీఎం జగన్ అభ్యర్థన…