Measles Outbreak in maharashtra, Mumbai Worst-Hit: మహారాష్ట్రను మీజిల్స్(తట్టు) వ్యాధి కలవరపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700కు మించి కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలో చాలా వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 14మంది మరణించారు. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్క ముంబై నగరంలోనే 10 మంది మరణించారు. ముంబై ప్రాంతంలో నవంబర్ 28 నాటికి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం కొత్తగా ముంబైలో మరో 5 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. ఒక అనుమానాస్పద మరణం చోటు చేసుకుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 717 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఒక్క ముంబై నగరంలోనే 303 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Fifa World Cup: ఇంటిదారి పట్టిన ఇరాన్.. సంబరాలు జరుపుకున్న ఇరాన్ ప్రజలు
వారంలో ఐదు అనుమానిత కేసులు ఉంటే..వాటిలో రెండు ప్రయోగశాలలో నిర్థారణ అయితే వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లుగా గుర్తిస్తారు. జనవరి నుంచి నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో 70 , ముంబై నగరంలోని భీవండీలో 48 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. ముంబైలో జనవరి 1,2022 నుంచి 11,390 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. అధికార డేటా ప్రకారం రాష్ట్రంలో 2019లో 1,337 కేసులు, 2020లో 2,150 కేసులు, 2021లో 3,668 ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది తట్టు వ్యాధి వల్ల 14 మంది మరణిస్తే ఇందులో ఒక్కరు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్లు తేలింది. మరణించిన వారిలో నలుగురు 0-11 నెలల వయసు గల పిల్లలు ఉన్నారు. 8 మంది 12-24 నెలల వయసు ఉన్న వారు ఉన్నారు. అయితే ఇద్దరు 25-60 ఏళ్ల వయస్సు ఉన్న పెద్దవాళ్లు కూడా ఉన్నారు. పెరుగుతున్న కేసులు, మరణాల దృష్ట్యా ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.