మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి ఇప్పుడు చర్చగా మారింది.. ఇవాళ ఏకంగా ఏపీ కేబినెట్ భేటీలోనూ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.. ఇప్పటివరకు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై డీజీపీ వివరణ కోరింది కేబినెట్.. అయితే, ఒక్కో మరణం గురుంచి కేబినెట్ కు వివరించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. దీంతో, ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పూర్తి…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. అజెండాలోని 14 అంశాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గ సమావేశం.. ముఖ్యంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్లో మార్పు చేర్పుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ, వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మార్కాపురానికి సీఎం వెళ్లనున్నారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం…
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను...ఒకటి కన్ఫామ్ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
ఇంట్లో రచ్చ... బయటా రచ్చే.... ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం.... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఇది.
నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పారని, ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు నాయుడు రూ.36 వేల బాకీ ఉన్నారన్నారు. మహిళలు ఉచిత బస్సు చాలా చిన్న హామీ అని, అది కూడా ఇంతవరకు అమలు చేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తల్లికి వందనం అన్నారు.. రూపాయి కూడా ఇంతవరకు…
గవర్నర్ ప్రసంగం, బడ్జెట్పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఓ వివాహ…
తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి... అయితే, గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పామంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.