Vontimitta Temple: ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం సందర్శించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.
దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.
Read Also: Gas Cylinder Price Hike: వంటింట్లో మంట.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Bobby : బాలీవుడ్ బడా హీరోతో డైరెక్టర్ బాబీ మూవీ..?
మంత్రి సవిత మాట్లాడుతూ… ముఖ్యంగా కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించామన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు గ్యాలరీలను క్రమబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతిఒక్కరికీ తాగునీరు, అన్న ప్రసాదం కొరత లేకుండా అందేలా చర్యలు చేపట్టామన్నారు. కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా, ఒక మధుర స్మృతిగా భక్తులు గుర్తుంచుకునేలా కల్యాణ వేదిక ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: అడవి తల్లి బాట.. 15 ఏళ్ల పాటు కూటమి పాలన కొనసాగిలి..
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా.. అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశామన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుదీకరణ, తోరణాలు, పుష్పాలంకరణ, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.