కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.. హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కల్యాణ్.. అసలు తానే హోమ్ మంత్రి అవుతా అని పవన్ హెచ్చరించారు కూడా... ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్.. ఏదైనా సమస్య వస్తే హోమ్ మంత్రిగా అనిత వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు..
ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల సీఎంలు. కుల గణనపై చర్చ, తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్న CWC. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్న టీకాంగ్రెస్ బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ధన్యవాదాలు తెలపనున్న నేతలు. నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన. ప్రధాని మోడీ సభకు 5లక్షల మంది…
రైతుల్ని పారిశ్రామిక వేత్తలను చేస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, దీనిని సాధించేందుకు అండగా ఉంటామన్నారు. మహిళలు కూడా పరిశ్రమలు పెట్టి ఆదాయాన్ని ఆర్టించాలని, మహిళలను కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. పారిశ్రామిక పార్కులలో పరిశ్రమలను తెచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలిని .. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత…
కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికులకు వైద్య సేవల కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలులలో ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఇసుక దొరకకపోవడంతో కార్మికుల చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.…
ప్రధాని సభకు రావాలంటూ జగన్‌కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని…
ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం శ్రేయాస్ అయ్యర్ (72), ప్రభ్సిమ్రాన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై…
అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు. తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.…
విశాఖ జిల్లా సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సింహాచలం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు.. ఆరు రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి రెండు రోజుల కిందట పూర్తి చేశారు.. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ? చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు..
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి రోడ్డుపన్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..