Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 03 06 2025

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :June 3, 2025 , 5:13 pm
By Gogikar Sai Krishna
  • ఈ నెల 5న కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
  • సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
  • మాజీ మంత్రి కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!
  • ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి

తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు. భూ సంస్కరణలు తెచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు.

చంద్రబాబుపై 24 కేసులున్నాయి.. ఆయన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా..?

ఇదే చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా? అని‌అడుగుతున్నాను అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆయన.. లో వైఎస్‌ జగన్‌.. జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించిన జగన్‌.. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్‌ విక్టర్ సహా ముగ్గురుని, వాళ్ల కుటుంబాలను పరామర్శించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విక్టర్ పై ఘటన జరిగిన తర్వాత రౌడీషీట్ ఓపెన్ చేశారు.. ఇంత స్పష్టంగా నిజాలు ఉన్నాయి.. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే రకరకాలుగా అధికారపార్టీ నేతలు మాట్లాడుతున్నారు.. కేసులు తేల్చాల్సింది కోర్టులు.. కోర్టు అధికారం పోలీసులు తీసుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు.. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.. అదుపుతప్పిన పోలీసు వ్యవస్థకు నిదర్శనం తెనాలి ఘటనే అన్నారు..

ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!

రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో రష్యా వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ డ్రోన్లు నాశనం చేశాయి. సెమీ ట్రక్కుల్లో రహస్యంగా తరలించిన 117 డ్రోన్లతో రష్యన్ బాంబర్లను పేల్చేశాయి. రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఏడాదిన్నరగా వేసిన పక్కా ప్రణాళికను ఉక్రెయిన్ అమలు చేసి విజయం సాధించింది. దీంతో ప్రపంచమంతా ఉలిక్కి పడింది. అయితే ఇంత రహస్యంగా ట్రక్కుల్లో డ్రోన్లు ఎలా తరలించగలిగారని రష్యా దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఉక్రెయిన్‌కు గూఢచారిగా వ్యవహరించిన వ్యక్తిని రష్యా నిఘా వర్గాలు గుర్తించినట్లుగా డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని పేర్కొంది. అతడి పేరు ఆర్టమ్ టిమోఫీవ్‌గా నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇతడి కోసం దేశ వ్యాప్తంగా నిఘా వర్గాలు గాలిస్తున్నాయి. ఆర్టమ్ టిమోఫీవ్‌ సాయంతోనే ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ చేపినట్లుగా నిర్ధారించింది. ఆర్టమ్ ఉక్రెయిన్‌లో జన్మించాడు. అనంతరం వ్యాపారం పేరిట రష్యాలోని చెల్యాబిన్స్క్ నగరానికి వెళ్లి స్థిరపడ్డాడు. ఇతడే ఆపరేషన్ స్పైడర్ వెబ్‌కు స్లీపర్ సెల్‌లా పని చేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.

ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం

ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర కాల్పులు జరపడంతో ఇద్దరు ఇజ్రాయెల్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం అమెరికాలోని కొలరాడోలోని బోల్డర్‌ ప్రాంతంలో ఒక వ్యక్తి సీసా బాంబులు విసిరడంతో పలువురు గాయపడ్డారు. ఇలా యూదులకు వ్యతిరేకంగా పాలస్తీనా సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు.

కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇస్తారా…?

కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని పోలీసులు, ప్రభుత్వానికి సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. గుంటూరు జిల్లా తెలానిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రాకేష్, జాన్ విక్టర్, బాబూలాల్‌ ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టులో హాజరుపర్చే ముందు హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది.. గాయాలు చూపిస్తే డాక్టర్లు నోట్ చెయ్యలేదు? అని ప్రశ్నించారు.. మెడికో లీగల్ కేసు అవుతుందని ఇలా చేశారా..? పోలీసులు డాక్టర్ ను బెదిరించి ఉండాలి.. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే.. మంచివారైన పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారు.. చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే.. పోలీసులు చేసిన పనిని‌ సమర్దించుకునేందుకు వీరిపై సంఘవిద్రోహులుగా ప్రచారం చేశారు.. జరిగిన ఘటన దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు..

మాజీ మంత్రి కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!

ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్ వైద్యులు దాదాపు 10 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. అయితే.. ఆపరేషన్ జరిగి రెండు నెలలు దాటినా కొడాలి నాని ఇప్పటికీ బయటకు రాలేదు. హైదరాబాద్ లోనే ఉంటూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సెట్ అవ్వలేదని.. ఈ నేపథ్యంలో మెరుగైన శస్త్ర చికిత్స కోసం అమెరికా తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

జగన్.. రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే..

జగన్ ఒక రంగుల రెడ్డి, జగన్ వి చీప్ పాలిటిక్స్.. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని… గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్ లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమేనన్నారు. జగన్ ఖబడ్దార్.. మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.. అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. తల్లికి, చెల్లికి వెన్ను పోటు పొడిచింది నీవు కాదా? అని ప్రశ్నించారు. ప్రజలు మీకు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోండి.. మీ బాబాయిని చంపితే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయలేదన్నారు…

దళితుల పేరిట లూటీ.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై రామ్మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల సంక్షేమ పథకాల పేరుతో నిధులను పక్కదారి మళ్లించారని ఆరోపించారు. 240 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించడానికి ఏకంగా నాలుగు కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారని, ఇది నమ్మదగిన విషయం కాదన్నా సామా రామ్మోహన్‌ రెడ్డి. మూడు సంస్థల పేరుతో కోడింగ్ శిక్షణ చేపడతామన్నా, కేవలం రెండు సంస్థలకే అనుమతులు తీసుకున్నారు అంటూ మండిపడ్డారు.

సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?

2014 – 19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని.. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు.. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..? అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఈ అంశంపై పట్టించుకోవడం లేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలను ముద్రగడ పద్మనాభం నిరసనలకు ఆందోళన చేపట్టారని.. తునిలో భారీ బహిరంగ సభ జరిగిందన్నారు.. సభ తర్వాత రైల్వే ట్రాక్ పై రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగులబడిందని వెల్లడించారు. రైలును కాపులే తగులబెట్టారని అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు..

ఈ నెల 5న కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

రాష్ట్రంలో కొనసాగుతోన్న తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జూన్ 5న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు వేదికకానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ జరగనుంది. పాత పింఛన్ విధానం, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై తీసుకునే నిర్ణయాల కోసం ఇది కీలకంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • nethanyahu
  • telugu news
  • tg cabinet

తాజావార్తలు

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

  • Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..

  • CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..

  • Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions