Botsa Satyanarayana: ఏడాది కాలంలో చంద్రబాబు ప్రజలకు వెన్ను పోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు.. మహానాడు వేదికగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు.. ప్రజలకు ఇబ్బంది కలగ కూడదని ఇంటింటికి రేషన్ ను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.. కానీ, కూటమి ప్రభుత్వం దానిని తొలగించింది.. ఇంటింటికి రేషన్ తీసివేయడం వలన వృద్ధులు, వికలాంగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు..
Read Also: Ameer Khan : సినిమాలకు అమీర్ ఖాన్ గుడ్ బై.. ఆ మూవీ తర్వాత..
ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రీవాల్యుషన్ లో ఐదు మార్కులకు మించి ఎన్నడూ తేడా లేదు . కానీ, కూటమి పాలనలో 20 నుంచి 30 మార్కులు వరకు తేడా వస్తుందని దుయ్యబట్టారు బొత్స.. 5000కు మించి మా హయాంలో ఎన్నడు రీవాల్యుయేషన్ జరగలేదు. విద్యావ్యవస్థ పై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.. మరోవైపు, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయల్దేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాం అని వెల్లడించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..