HYD: నేడు వనమహోత్సవం -2025 కార్యక్రమం. ప్రొ.జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000,18 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,600 లుగా ఉంది. అలాగే కిలో వెండిధర రూ. లుగా ఉంది. 1,11,100 తిరుపతి: నేడు ఇందిరా మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభ. హాజరుకానున్న రాష్ట్ర బిసి మంత్రులు అనగాని సత్యప్రసాద్,…
CM Chandrababu: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ లో మాట్లాడారు.
వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్నినాని కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే, వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు. అయితే, వల్లభనేని వంశీ, కొడాలి నాని,…
CM Chandrababu: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
ఆయన సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరోల రిక్వెస్ట్ సౌత్ హీరోలు నార్త్‌లో సిసినిమాలు చేయాలనుకోవం కామన్. కానీ నౌ జస్ట్ ఫర్ ఛేంజ్ ముంబయి స్టార్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్, అమితాబ్, సైఫ్, అక్షయ్, అజయ్ దేవగన్ స్టార్స్ టాలీవుడ్ తెరంగేట్రం జరిపోయింది. కానీ వీరంతా వివిధ స్టార్స్‌తో వర్క్ చేశారు. కానీ కేవలం ఒక్క రజనీకాంత్ కోసం నార్త్ స్టార్ హీరోలు క్యూ కట్టడమంటే మామూలు విషయం కాదు.…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మరీ... అందుకు సంబంధించిన దిశా నిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల రెండు నుంచి మొదలైన కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెల రోజుల పాటు సిన్సియర్‌గా నిర్వహించాలన్న ఆదేశాలున్నాయి పార్టీ పెద్దల నుంచి.
మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకు, అందులోనూ ప్రత్యేకించి టీడీపీ వాళ్ళకు ఏమైందని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడమే కాకుండా కనీసం వైసిపి విమర్శలకు సైతం కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా ఎందుకు ఉండటం లేదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి.
గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు..