ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ…
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా…
ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని…
ఆ జిల్లాలో బాహుబలి సినిమా కేరక్టర్స్ తెగ తిరిగేస్తున్నాయి. ఇన్నాళ్ళు కట్టప్పలు కామనైపోగా… ఇప్పుడు కొత్తగా బిజ్జలదేవలు కూడా మొదలైపోయి రన్ రాజా రన్ అంటున్నారు. వెన్నుపోట్లు, పదవుల కోసం కక్కుర్తి, కాంప్రమైజ్ లాంటి మాటలు తెగ పేలుతున్నాయి. ఏ నలుగురు కలిసినా ఇలాంటి చర్చే జరుగుతోంది ఏ జిల్లాలో? అక్కడ కొందరు వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటి? Also Read:Hyderabad JNTU University: విద్యార్థుల నుంచి డబ్బులు గుంజేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ…
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏపీ సచివాలయంలో అమరావతి రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని కాన్ఫెరెన్స్ హాల్లో వంద మంది రైతులతో సీఎం సమావేశమవ్వనున్నారు. రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. రైతుల సమావేశంలో సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులకు ప్లాట్లు కేటాయింపు, జరీబు-మెట్ట భూములు, ఎసైన్డ్ భూములకు సంబంధించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు…
Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.
ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చినట్లే…ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు సకాలంలో పూర్తవుతాయా ? రైతులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకుంటారా ? రాజధాని అజెండాతో మూడు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు…అమరావతి విషయంలో సాధించిందేంటి ? రాజధాని నిర్మాణాలు నత్తనడకన సాగితే…వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవా ? సీఆర్డీఏ అధికారుల విషయంలో రైతుల వాదనేంటి ? ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి ? తెలుగుదేశం పార్టీ ప్రధాన ఏజెండా…రాజధాని అమరావతి. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ…
మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ…