Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 02 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్

Published Date :February 2, 2026 , 9:07 pm
By Gogikar Sai Krishna
  • జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. తీరు మార్చుకోకపోతే ఉపేక్షించం!
  • షేక్ హసీనాకు భారీ షాక్.. పదేళ్ల జైలు శిక్ష విధించిన బంగ్లాదేశ్ కోర్టు
  • D55 క్రేజీ అప్‌డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు
  • ఎన్నో చూశాం కానీ.. ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొడుకు చేతికి $260 బిలియన్ల ఆస్తులు.. వారసుడికి బాటలు వేస్తున్న UAE ప్రెసిడెంట్!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ రాత్రికి రాత్రే 260 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను తన కుమారుడు షేక్ ఖలీద్‌కు బదిలీ చేశారు. యూఏఈ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో జాయెద్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. యూఏఈ – సౌదీ అరేబియాతో వైరంలో చిక్కుకుంది, ఇదే సమయంలో జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబంలో అధికార పోరు కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు తన కుమారుడు ఖలీద్‌కు రాత్రికి రాత్రే $260 బిలియన్ల ఆస్తులను బదిలీ చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశం అవుతుంది.

“స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ”.. డెలివరీబాయ్ ఏం చేశాడంటే..

ఒక మహిళ స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్మశానంలోకి ఫుడ్ ఆర్డర్ ఏంటా.? అని ఆందోళన చెందడం డెలివరీ బాయ్ వంతైంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఆన్లైల్‌లో కనిపిస్తున్న వీడియోలో, డెలివరీ ఏజెంట్ ఫోన్‌లో కస్టమర్‌తో మాట్లాడుతూ.. లొకేషన్ వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే, మహిళ సమాధానం విన్న డెలివరీ బాయ్‌కి ఫ్యూజులు అవుటయ్యాయి. మహిళ శ్మశానంలో ఉన్నట్లు డెలివరీ బాయ్‌కు అర్థం అవుతుంది. డెలివరీ ఏజెంట్ మహిళతో మాట్లాడుతూ.. ‘‘మేడమ్ నేను లొకేషన్‌లో ఉన్నాను. నేను ఇప్పుడు ఎక్కడి రావాలి..?’’ అని అడుగుతాడు. ఇందుకు ఆ మహిళ ‘‘ నేరుగా రండి, అక్కడ ఒక కుక్క కూర్చుని ఉండటం చూస్తారు’’ అని చెబుతుంది. దీనికి డెలివరీ బాయ్..‘‘మేడమ్ అది స్మశానవాటిక’’ అని చెబుతాడు. దీనికి మహిళ..‘‘కుక్కను చూశారు కదా? స్మశాన వాటిక గేటు లోపటికి రండి’’ అని అడుగుతుంది.

ఎన్నో చూశాం కానీ.. ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు!

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఇటీవల తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా మండిపడింది. NTVతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందని, టీడీపీ కార్యకర్తలు ప్రీ-ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ఇక ఆమె ప్రెస్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ దాడికి ముందే రెచ్చగొట్టి ప్రేరేపించారని, రెచ్చగొట్టిన వీడియోలు కూడా ఉందని చెప్పారు. అలాగే కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తనపై దాడికి ముందు సినిమా చూపిస్తామని హెచ్చరించినారని ఆమె అన్నారు. అలాగే తన వ్యాఖ్యలు అసభ్యంగా మాట్లాడిన వాళ్లను ఉద్దేశించి చేసినవనీ, సీఎం చంద్రబాబును కాదనీ అన్నారు.

బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది?.. పీసీబీపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లా ఆడకపోతే.. పాకిస్థాన్ కూడా బహిష్కరిస్తుంది అనే పీసీబీ ఆలోచనపై అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా ఆలోచనలు పాకిస్థాన్ క్రికెట్‌కు మేలు చేయవని స్పష్టం చేశారు. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దాయాదుల మధ్య లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో షెడ్యూల్ అయి ఉంది. ‘బంగ్లాదేశ్ ఆడకపోతే పాకిస్థాన్ ఎందుకు టీ20 వరల్డ్‌కప్‌ 2026ను బహిష్కరించాలి?. అసలు పాకిస్థాన్ క్రికెట్‌కు బంగ్లాదేశ్ ఏం చేసింది?. ఇందులో నాకు ఎలాంటి లాజిక్ కనిపించడం లేదు. ఇతర దేశాల నిర్ణయాలపై ఆధారపడి పీసీబీ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’ అని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం దృష్టి పెట్టాల్సింది రాజకీయాలు, వివాదాలపై కాదని.. ఆటపై మాత్రమేనని అని అన్నారు. ‘పాకిస్థాన్ క్రికెట్ ముందుగా తన సమస్యలపై దృష్టి పెట్టాలి. జట్టు ఆటను మెరుగుపర్చుకోవాలి. వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి’ అని అక్రమ్ సూచించారు.

D55 క్రేజీ అప్‌డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

అమరన్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు రాజకుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా D55 అనే ఒక ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకీ ఆ క్రేజీ అప్‌డేట్ ఏంటో తెలుసా.. ఈ చిత్రంలో ధనుష్‌ సరసన సాయి పల్లవి జత కడుతోంది. గతంలో ఆమె అమరన్‌ సినిమాలో చేసిన పాత్రకు సినీ ప్రేమికుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోయిన్ల రాకతో సినిమాకు అదనపు ఆకర్షణ వచ్చినట్లు అయ్యిందని ధనుష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కేంద్ర బడ్జెట్‌పై షాకింగ్ కామెంట్స్.. 42 హామీలు ఏమైనట్టు.?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పూర్తిగా నిరాశజనకంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా, విభజన చట్టంలోని 42 కీలక అంశాలు నేటికీ పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమావేశాల్లోనైనా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ కేంద్రం మళ్ళీ మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం వెంటనే స్పందించి విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర.. ఉద్ధవ్ ఎంపీ ఆరోపణ..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న బారామతి ఎయిర్‌పోర్టులో జరిగిన ఫ్లైట్ క్రాష్‌లో మరణించారు. ఈ ప్రమాదంపై ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటన అనుమానాస్పదంగా ఉందని అభివర్ణించారు. సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మీడియాలో మాట్లాడుతూ.. అజిత్ పవార్ స్థాయి, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల దృష్ట్యా అనుమానాలు రావడం ఖమని అన్నారు. అజిత్ పవార్ మరణానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను పరిశించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ పవార్, శరద్ పవార్‌‌ల ఎన్సీపీలు కలిసిపోవాలనే కోరిక వ్యక్తం చేశారని, బీజేపీ సించాన్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లతో బెదిరించారని రౌత్ అరోపించారు. ఈ ఆరోపణలపై అజిత్ పవార్ స్పందించిన తర్వాత పదిరోజుల్లోనే మరణించారని, దీనిపై అనుమానం వ్యక్తం చేశారు.

ఎయిర్ ఇండియాకు తప్పిన భారీ ప్రమాదం.. ఇంధన స్విచ్ ‘‘రన్’’ నుంచి ‘‘కట్ ఆఫ్’’కి మార్పు..

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంధన స్విచ్‌లలో సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో దానిని గ్రౌండ్ చేశారు. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఎడమ ఇంజన్‌కు సంబంధించిన ఇంధన స్విచ్ ‘‘రన్’’ పొజిషన్‌లో నిలువకుండా రెండుసలార్ ‘‘కట్ ఆఫ్’’కి మారిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. AI 132 ఫ్లైట్ లండన్ హిత్రో విమానాశ్రయం నుంచి బెంగళూర్ రావాల్సి ఉంది. పైలట్ లేవనెత్తిన సమస్యను అవ్యవసర ప్రాతిపదికన పరిశీలిస్తు్న్నామని ఎయిర్ ఇండియా చెప్పింది. ఈ అంశాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తెలియజేశారు. ఇంతకుముందు, డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌లో ఉన్న అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో లోపాలు లేవని సంస్థ వెల్లడించింది.

జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. తీరు మార్చుకోకపోతే ఉపేక్షించం!

జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన “పార్టీ పదవులు ఇస్తే పార్టీ కోసం మీరు ఏం చేస్తున్నారు?” అంటూ నేతలను నిలదీశారు. పార్టీపై, తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్న సమయంలో నేతలు మౌనంగా ఉండటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనపై, నా మీద అబద్ధపు ప్రచారం జరుగుతున్నా ఎందుకు తిప్పికొట్టడం లేదు? అని ప్రశ్నించారు. పార్టీ తరఫున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

షేక్ హసీనాకు భారీ షాక్.. పదేళ్ల జైలు శిక్ష విధించిన బంగ్లాదేశ్ కోర్టు

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక కోర్టు ఆమెకు రెండు అవినీతి కేసుల్లో మొత్తం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు సోమవారం (ఫిబ్రవరి 2, 2026) ఢాకా స్పెషల్ జడ్జ్ కోర్టు-4లో జడ్జి రబిఉల్ ఆలం ఇచ్చారు. రాజధాని ఢాకా శివార్లలోని పుర్బాచల్‌లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ నివాస స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. 79 ఏళ్ల హసీనా తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి తన బంధువులకు చట్టవిరుద్ధంగా భూమిని కేటాయించారని కోర్టు గుర్తించింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • janasena
  • pawan kalyan
  • shaik haseena

తాజావార్తలు

  • Shocking Reveal : రష్మిక బ్రేకప్‌ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!

  • YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!

  • Motorola Edge 70 Fusion: మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫస్ట్ సేల్ టుడే.. 7000mAh బ్యాటరీ, Sony LYT-710 కెమెరా

  • RN Ravi: ఎన్నికల వేళ కీలక పరిణామం.. బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం

  • Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్‌తో హిట్లు వస్తాయా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions