స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్‌ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి…
CM Chandrababu: స్త్రీ శక్తి పథకం యొక్క మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణి లను గౌరవించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 2.02 కోట్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం కోసమే ఈ పథకం తెచ్చాం.. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటాం..
AP Free Bus Scheme: అమరావతిలోని ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది.. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్‌కు బస్సులో రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సాయంత్రం 4 గంటలకి విజయవాడ బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.. ఇక, ఆయా నియోజక వర్గాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. జిల్లాలో అందరూ ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సూచించారు.. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారనే విషయాన్ని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
పాక్ కు గూఢచర్యం.. డీఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్‌ను అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కోసం గూఢచర్యం చేయడం, దేశ రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు పంపడం వంటి ఆరోపణలపై రాజస్థాన్ CID ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది. మహేంద్ర ప్రసాద్‌ను ఆగస్టు 13 బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి…
విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడు, రేపు పాఠశాలలకు సెలవు తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న…
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ.. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మూడు రకాల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లు జారీ చేసింది. దేవాదాయ శాఖలో ఈఓ, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ అధికారి, భూగర్భజలాల శాఖలో జియో ఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వ్యవసాయ అధికారులు 10 పోస్టులకు ఆగష్టు 19 నుంచి సెప్టెంబరు 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఎండోమెంట్ ఈఓలు 7 పోస్టులకు…
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకు ప్రచారం! నేటి సమాజంలో రోజురోజుకూ దుర్మార్గాలు పెరిగిపోతున్నారు. ఆస్తి కోసం కొందరు దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు. నవమాసాలు మోసిన కన్న తల్లినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయితే తాజాగా మరో నీచమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి మొత్తం రాయించుకున్నాక.. కన్న తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకే పుకార్లు పుట్టించి ఇంట్లో నుంచి గెంటేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే…