CM Chandrababu: బాలయ్య రచ్చకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారా..?
- అసెంబ్లీలో బాలయ్య రచ్చకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారా..?..
- ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ ను పరామర్శించిన చంద్రబాబు..
- పైకి పరామర్శే అయినా.. చర్చ మొత్తం వివాదం పైనే జరిగినట్టు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు… మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు కలిగిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వం లో జరిగిన సినిమా మీటింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్.. సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించి చర్చించారు. చిరంజీవి లీడ్ తీసుకోవడం.. గట్టిగా మాట్లాడడం వల్లనే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు.. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ మండి పడ్డారు.. ఎవడూ… గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు బాలకృష్ణ.. అయితే, బాలకృష్ణ వ్యాఖ్యల పై పవన్ కల్యాణ్, నాగబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు.. కానీ, చిరంజీవి ఫాన్స్ రగిలిపోయారు.. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిరసనలు తప్పవన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.. ఈ దెబ్బకి కామినేని తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి అన్నారు.. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడే చంద్రబాబు అలర్ట్ అయ్యారు.
Read Also: Karur Stampede: పథకం ప్రకారం జరిగిన కుట్ర.. నేడు హైకోర్టులో టీవీకే పిటిషన్‌పై విచారణ!
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు… పవన్ వైరల్ ఫీవర్‌తో ఉన్నందున పరామర్శించారు… పేరుకు పరామర్శ.. కానీ, చిరంజీవి అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం.. ఇప్పుడు కనక. ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు చంద్రబాబు గుర్తించారు. చిరంజీవి విషయంలో సరిగ్గా స్పందించక పోతే ప్రధాన సామాజిక వర్గం నుంచి కుడి ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. దీంతో పాటు కూటమి లో ప్రధానంగా పవన్ ఉన్నారు. దీంతో సామాజిక వర్గంలో కనక… ఆందోళనలు మొదలైతే. అవి ఏ స్థాయికి వెళ్తాయో చంద్రబాబుకు బాగా తెలుసు.. అందులోనూ మొన్నటి ఎన్నికల్లో కూటమికి ప్రధాన మద్దతు ఇచ్చిన సామాజిక వర్గం కావడంతో బాబు మరింత సీరియస్ గా తీసుకున్నారు.
అందులోనూ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ కావడంతో మరింత హాట్ టాపిక్ అయ్యాయి.. పవన్ కల్యాణ్ ఈ విషయంలో స్పందించక పోవడం కూడా ఇబ్బందులు తప్పవని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే వెళ్లి పవన్ ను కలిసారు.. చిరంజీవి అంశం చాలా.. సున్నితమైన అంశం కావడంతో చంద్రబాబు ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో నే ఈ అంశానికి పవన్ ను కల్వడంతో క్లోజ్ చేశారు. గతంలో కూడా. 2014లో మొదటి సారి పవన్ కల్యాణ్ అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లారు చంద్రబాబు.. ఇప్పుడు కూడా ఇబ్బంది వచ్చిందని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. మొత్తానికి తన రాజకీయ అనుభవం ప్రస్తుతం చంద్రబాబు ఉపయోగించి.. సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?