రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు…
CPI Ramakrishna: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు అని ఆరోపించారు.
Ambati Rambabu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ లు మొదలు పెట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు.. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు.
AP Home Minister: విశాఖపట్నంలో నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి నివారణ మీద సమీక్ష చేపట్టినట్లు తెలిపారు.
Chandrababu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి ఇవాళ ( మంగళవారం ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయి ఫణీంద్ర చికిత్స కోసం తగిన సాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం అందించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలకపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేశారు.. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపెట్టారు.. అయితే, మద్యం స్కాంలో ప్రభుత్వం దృష్టికి సంచలన వాస్తవాలు వస్తున్నాయట.. మద్యం శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలకంటే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయట..
గిరిజన సంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు స్వయంగా వివరించారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇక, అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది..
మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు
పింఛన్ల లబ్ధిదారులకు ఒక్కరోజులోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ సర్కార్.. పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం..