ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
AP CM Review Meeting: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం వచ్చే నెల 7న జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు కర్నూలు జిల్లాలోన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోని శ్రీశైల ప్రాజెక్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు సమాచారం.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కీలక శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
AP CM: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు.
ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని…
CM Chandrababu: సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.