మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలిసి ప్రారంభించారు. ఎకో పార్కులో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యే కారును కడిగిన పోలీసు.. వీడియో వైరల్. మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను…
కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది.. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నరసరావుపేట JNTU కాలేజీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటనున్నారు. తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జగన్‌ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మాదీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ ఆషాఢ భూతి అని.. నమ్ముకున్న వాళ్లను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని ఆషాఢ భూతి అంటారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం అమలు చేస్తామని.. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫేజ్ రీయింబర్స్మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి.. అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్‌గా పేరున్న కొల్లం గంగిరెడ్డి.. చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారనే వ్యవహారం.. బీజేపీలో వివాదాస్పదంగా మారందని.. కొందరు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ…