కృష్ణమ్మ ఉధృతితో కొట్టుకొస్తున్న బోట్లు.. విజయవాడ రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో వరద నీరు విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గమ్మ వారధి మీదుగా, ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్కుల నీరు.. ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల…
పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి.. గుడివాడలో ఉద్రిక్తత..! గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కాచి మరి పేర్ని నాని కాన్వాయ్‌ను అడ్డుకుని కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. తమ అధినేతపై పేర్ని నాని చేసిన…
Chandrababu- Amit Shah: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం సంప్రదింపులు జరుపుతూన్నారు. ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఏపీలోని వరద పరిస్థితులను అమిత్ షాకు వివరించగా.. అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
Chandrababu Tweet: ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న వరద సంభవించడంతో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించి.. సహాయక చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
NTR District: విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు కలెక్టరేట్లోనే బస చేస్తానని సీఎం నిర్ణయించుకున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసాను.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను అని పేర్కొన్నారు. ఇంత వరదను ఊహించలేదు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి వరదలు చూడలేదు.. అవసరమైతే మళ్ళీ వస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య.. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ…
Singh Nagar floods: విజయవాడ నగరంలోని సింగ్‌నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. దీని వల్ల సింగ్‌నగర్ పూర్తిగా నీట మునిగింది. ఇక, సింగ్ నగర్ లో వరద ఉధృతి ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు.
అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్ డీసీల్లో పర్యటన.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా పంచుకున్నారు. ‘‘రాహుల్…