వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు.. మరోవైపు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.. మరోవైపు.. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని…
కృష్ణా నదిలో బోట్లు వచ్చి.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం సంచలనంగా మారింది.. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీ-కొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది.. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం…
ఆక్రమణలు తొలగించేలా పటిష్ట చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా.. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి.. మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అండగా ఉంటాయని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. క్షణాల్లో వచ్చిన భారీ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం. కలిసికట్టుగా…
ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు.
విజయవాడ సహా ఏపీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. ఇక, కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మరోవైపు.. ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.
ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయింది. బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చగా.. తాజాగా మూడో గండిని అధికారులు పూడ్చివేశారు. నాలుగు రోజులుగా గండ్ల పూడ్చివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు చేస్తానన్న సాయం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు.
వరద నష్టంపై రేపు కేంద్రానికి నివేదిక అందచేస్తాం.. నష్టం అంచనాలపై నివేదిక రేపు పంపనున్నట్టు వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, ఏరియల్ సర్వే తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏరియల్ సర్వే చేశాను.. కొల్లేరు సరస్సు, బుడమేరు, కృష్ణానది పరివాహక ప్రాంతం చూశాను.. బుడమేరు గండ్లు పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ రోజు రాత్రి కల్లా బుడమేరు గండ్లు పూడుస్తామని వెల్లడించారు.. ఆర్మీ వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి…