వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు.
బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మూడు గండ్లు పూడ్చిన విధానాన్ని మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. గండ్ల పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు కాల్వ వల్ల నగరానికి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు.. సీఎం సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి…
ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు..…
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనింది. పవన్…
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వదర బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు.
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు ఉపశమనం..రాజీనామాకు రైల్వే శాఖ ఆమోదం వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల రాజీనామాలను భారతీయ రైల్వే సోమవారం ఆమోదించింది. శుక్రవారం కాంగ్రెస్‌లో చేరడానికి ముందు, ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే, పార్టీ తన రైతు విభాగంలో బజరంగ్ పునియాను చేర్చుకున్నప్పుడు, జులనా నుండి వినేష్‌కు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ ఇచ్చింది. ఆమె రాజీనామా ఆమోదించడంతో వినేష్ ఫోగట్‌కు పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు…
వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళంపై సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాకెట్ మనీని వరద సాయంగా ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.