CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో గుడ్‌న్యూస్ చెప్పారు.. సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుంది.. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తాం.. స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటాం.. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తాం అని పేర్కొన్నారు..
Read Also: Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆ జంట విడాకులకు ఆయనే కారణం..!
ఇక, బెజవాడకు అకాల వర్షాలు వచ్చాయి. బుడమేరు పెద్ద ఎత్తున వరద వచ్చింది. విజయవాడ అతలాకుతలం అయ్యిందని పేర్నొన్నారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం బుడమేరు గండ్లను పూడ్చలేదు. గొంతు వరకు నీళ్లున్నాయి.. భోజనం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం. ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టరేట్‌లో ఉన్నా. వరదపై యుద్దమే చేశాం. స్వచ్ఛ సేవకులు నన్ను అర్థం చేసుకున్నారు. వరదల వల్ల అంటు వ్యాధులు రాకుండా అడ్డుకోగలిగాం. స్వచ్ఛ సేవకులు కృషి వల్లే ఇది సాధ్యమైంది. బెజవాడలో వరద బాధితులకు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజీ ఇచ్చాం. వరద సాయం కింద పెద్ద ఎత్తున విరాళాలు కూడా వచ్చాయి. రూ. 450 కోట్లు విరాళాలు రూపంలోనే వచ్చాయి. నేను చేసిన పనికి గుర్తింపు లభించింది.. అదే నాకు కిక్ అని అభివర్ణించారు.
Read Also: Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆ జంట విడాకులకు ఆయనే కారణం..!
అనంతపురంలో రథం తగులబెట్టి నెపం మన మీద నెట్టే ప్రయత్నం చేశారు. రామతీర్ధంలో రాముడి తల తీసేస్తే ఎంక్వైరీ లేదు. మూడు సింహాలు దొంగిలిస్తే విచారణ లేదు. ఇకపై నేరాల కట్టడికి డ్రోన్లు ఉపయోగిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. నేరస్తుల ఆటకట్టిస్తాం. ప్రజలకు, రైతులకు సేవలందించడానికి డ్రోన్ల వినియోగం. ప్రతి ఒక్క ఇంటికీ కరెంట్, గ్యాస్ ఇస్తాం. గతంలో దీపం పథకం మనమే పెట్టాం. మన చేసిన పనులను అప్పుడప్పుడు మరిచిపోతున్నారు.. అందుకే కష్టాలు వస్తున్నాయి. టీడీపీ చేసిన పనలను మరిచిపోయినప్పుడల్లా భూతం వస్తోంది.. ఇబ్బందులు వస్తున్నాయి అన్నారు.. మరోవైపు.. దీపావళీ నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 2027 నాటికి ఇంటింటికి కుళాయి అందిస్తాం. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఇచ్చే నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. రిర్వాయర్ల నీటిని ప్రజలకు ఇమ్మంటే ఆ స్కీంను గత ప్రభుత్వం అటకెక్కించింది. పవన్, నేనూ ఆలోచించాం.. మూడేళ్లల్లో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇస్తాం అని వెల్లడించారు. ఇక, ఇంటింటికి వచ్చి చెత్తను సేకరిస్తాం అని ప్రకటించారు.. మంగినపూడి బీచ్ ను నాశనం చేశారు. మేం మంగిన పూడి బీచ్ ను టూరిజం స్పాటుగా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరూ చెట్టు పెట్టాలి. చెట్లు పెట్టండి.. పరిశుభ్రంగా ఉండండి అంటే నేను ఏదేదో చెబుతున్నానని కొందరు అనుకుంటున్నారన్న చంద్రబాబు.. మాకు ఓ రూ. 10 డబ్బులిస్తే చాలు ఇవన్నీ ఎందుకని కొందరు అనుకుంటారు. కానీ, తెలుగు జాతి అగ్ర భాగాన ఉండాలనేదే నా ఆలోచనగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..