ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు.. ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్…
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన కాలువలలో ఒకటైన బుడమేరు విజయవాడలోని అనేక నివాస ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, ముంపునకు గురికావడంతో రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సింగ్ నగర్, పాయకాపురం, వైఎస్ఆర్ కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురికావడానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నుంచి తేరుకుంటున్నారు బెజవాడ ప్రజలు. అయితే.. 80 శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం పట్టింది. సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి. Happy Teachers Day…
వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.. వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాలలోని బాధితులు లేదా ప్రజల వద్ద నుండి సదరు…
బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని అక్కడి పంపిస్తున్నారు లోకేష్. ఇక, బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు..
బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో ఎంతో మంది నిరాష్రులయ్యారు. వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా.. వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు అందజేసింది. ఈ సవాలు సమయాల్లో, మన రాష్ట్రం వరదల వినాశకరమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, కలిసి వచ్చి నష్టపోయిన వారిని ఆదుకోవడం మన సమిష్టి బాధ్యత.…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనతో సీఎం భద్రతా సిబ్బంది, అధికారులు పరుగులు పెట్టారు.. వరదలో.. అందునా జేసీబీపై నాలుగున్నర గంటల పాటు 22 కిలో మీటర్లు పర్యటించిన సీఎం చంద్రబాబు. కాన్వాయ్ని వీడి 22 కిలోమీటర్ల మేర పర్యటించడం ఇదే తొలిసారంటున్నాయి అధికారిక వర్గాలు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగింది.. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు.. దాదాపు ఆరు గంటల పాటు కాన్వాయ్ వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో తిరిగారు.. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరిగాల్సి వచ్చింది..