వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి.. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారన్నారు.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ముఖ్యమంత్రి ప్రసంగించారు.
అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని తెలిపారు సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించాం.
డిప్యూటీ సీఎం అంశంపై జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి కొల్లు రవీంద్ర పేరొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ చాలా ఉపయోగం అని, కూటమి ప్రభుత్వ చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. వైసీపీ పాలన భూదోపిడీ కోసం జరిగిందని ఎద్దేవా చేశారు. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుఉంటుందని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయని, పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగు…
రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రైతులకు స్మార్ట్ బిగించటం లేదని చాలాసార్లు చెప్పామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారని, ఇందులో నిజం లేదన్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబును చూసి…
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచదేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో తాము పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను మంత్రి లోకేష్ కోరారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన…
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది. అలాగే, ఈ నెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం దగ్గర రాజ్యాంగ సంస్థలను బీజేపీ- ఆర్ఎస్ఎస్ స్వాధీనం…
నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక. లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటన. అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 24 వరకు జరగనున్న గ్రామ సభలు. దావోస్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటన. సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొననున్న…
రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు తనను చూసేందుకు వచ్చిన తెలుగువారందరికీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. అందరూ చనిపోయిన తర్వాత గుర్తుంచుకుంటారని.. తనను మాత్రం బతికుండగానే గుర్తుంచుకున్నారని.. జీవితాంతం మర్చిపోలేమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..