CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. నిన్నటికి నిన్న గుంటూరు జీజీహెచ్ లో ఓ వృద్ధురాలు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేగింది.. అయితే, అధికారుల లెక్కల ప్రకారంలో ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి.. అనధికారంగా ఈ సంఖ్యలో ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది.. ఈ నేపథ్యంలో.. అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తోంది.. మరోవైపు.. ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు.. ఇంజక్షన్ కూడా అందుబాటులో ఉంచాలని.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also: NTPC Recruitment 2025: కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్.. నెలకు రూ.55 వేల జీతం
కాగా, గులియన్-బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదైన వ్యాధిగా చెబుతున్నారు వైద్యులు.. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని… బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కొన్నిసార్లు టీకా వికటించి ఈ పరిస్థితికి దారితీస్తుందన్నారు.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని పరిధిలోని నరాలపై ఎటాక్ చేస్తుంది. ఈ పరిస్థితి బలహీనత, తిమ్మిరి, అవయవాలలో పక్షవాతం వంటి లక్షణాలకు దారితీస్తుందని చెబుతున్నారు.. అయితే, ఇది సాధారణంగా ఫ్లూ లేదా కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ తో మొదలవుతుంది. క్రమంగా తీవ్రమవుతుంది. క్రమంగా రోగి కదిలే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు..