ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. డెహ్రాడూన్‌లో మంగళవారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. దీంతో కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
జమ్మూకాశ్మీర్‌ను వరదలు విడిచిపెట్టడం లేదు. కనీసం తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బతో క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలను బెంబేలెత్తించేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు.. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు.
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్‌లో క్లౌడ్ బరస్ట్ అయిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. శిథిలాలు ప్రవహించే ప్రాంతాలను మూసేశామని.. దీని కారణంగా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని చెప్పారు.
What is a CloudBurst: ఎలాంటి సంకేతాలు గానీ, హెచ్చరికలు లేకుండా.. మేఘాలు ప్రళయం సృష్టించడంను ‘క్లౌడ్ బరస్ట్’ అంటారు. సాధారణంగా వర్షాలు పడేటపుడు మేఘాలు ఉరుముతుంటాయి. దీంతో చాలా మంది అలర్టై అక్కడ నుంచి సేఫ్‌గా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ క్లౌడ్ బరస్ట్ అలా కాదు. ఎలా వస్తుందో.. ఎప్పుడో కూడా తెలియకుండా వస్తుంది. మేఘాలు గర్జించి, విస్ఫోటనాలై పేలిపోతూ.. క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టిస్తాయి. ఒక్క మాటలో క్లౌడ్…
Jammu Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడడం, రాళ్లు పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక చోట్ల అధికారులు రహదారులన్నీ మూసివేశారు. దోడా జిల్లాలోని థాత్రి సబ్ డివిజన్‌లో క్లౌడ్ బరస్ట్ కావడంతో విపత్తు సంభవించింది. ఈ ఘటనలో 10కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కఠువా, కిశ్త్‌వాడ్‌లోనూ ఇటువంటి విపత్తులే సంభవించాయి. గతంలో కిష్త్వార్, థరాలిలో కూడా ఇలాంటి…
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పది ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మృతుల్లో ఇద్దరు CISF జవాన్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు. శిథిలాల కింద లేదా ప్రమాదంలో చిక్కుకున్న ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి సహాయ సిబ్బంది గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. సహాయ…
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం…
హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు వెంటాడుతున్నాయి. ఇటీవల భారీ వరదలు కారణంగా రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. తేరుకునేలోపే మరోసారి జలఖడ్గం విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున మండిలో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది.
జమ్మూకాశ్మీర్‌లోని రాజ్‌గఢ్, రాంబన్‌లో ఒక్కసారిగా బుధవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ప్రవాహం ఏరులైపారింది. ఆకస్మిక వరదల్లో మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. మరో నలుగురు తప్పిపోయారు.